కేసులు పెరుగుతున్నాయి.. లాక్‌డౌన్ కూడా..

కేసులు పెరుగుతున్నాయి.. లాక్‌డౌన్ కూడా..

ఈనెల 14తో లాక్‌డౌన్ ముగుస్తుంది. మరి ఆ తరువాత పరిస్థితి ఏంటనేది ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే లాక్‌డౌన్‌ పొడిగించే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు గల కారణాలు వివరిస్తూ ఒక్కరోజులో 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసేసరికి లాక్‌డౌన్‌ని పొడిగించాలనుకుంటున్నామని అన్నారు. ఇప్పటికి ఈ వైరస్ బారిన పడి మహారాష్ట్రలో ఆరుగురు మరణించారు. వీరిలో ముంబై నగరానికి చెందిన వారు నలుగురున్నారు. వైరస్ ప్రభావిత నగరాల్లో లాక్‌డౌన్ పొడిగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అంటున్నారు. శుక్రవారం పుణే, జలగావ్‌లో ఒక్కొక్కరు వైరస్ బారిన పడి మరణించారు. ముంబైలోని బోరివిల్లీ, గొరాయ్ ఎంబీహెచ్ కాలనీలో ఓ యువ జంటకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో, చుట్టుపక్కల 80 కుటుంబాలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story