వైరస్‌కు అడ్డుకట్ట.. తమిళుల ముందు చూపు

వైరస్‌కు అడ్డుకట్ట.. తమిళుల ముందు చూపు

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో చెన్నై వాసుల్లో ఆందోళన అధికమవుతోంది. వైరస్‌ను అడ్డుకట్ట వేసేందుకు పరిశుభ్రతే ప్రాధాన్యతగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ అయినా జనం రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యవాసర వస్తువుల కొనుగోలుకు, కూరగాయల మార్కెట్‌కు వచ్చే వారు వైరస్ బారిన పడకుండా ఉంటడేందుకు ముందు జాగ్రత్త చర్యగా వారిపై సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇక్కడి తిర్పూర్ జిల్లాలోని మార్కెట్ల ముందు కరోనా డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. 16 అడుగుల పొడవు, 5 వెడల్పులో ఒక టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. దానికి ఇరువైపులా రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు. ఒక్కో సెట్‌కు మూడు నాజిల్స్ ఉంటాయి. వాటి ద్వారా వైరస్‌ను నాశనం చేసే ద్రవాణాన్ని పిచికారీ చేస్తున్నారు.

మర్కెట్‌కు వచ్చేవారంతా ముందు అక్కడే అమర్చిన వాష్ బేసిన్‌లో చేతులు కడుక్కోవాలి. ఆ తరువాత ఆ టన్నెల్ గుండా లోపలికి వెళ్లేముందు చేతులు పైకి ఎత్తాలి. అప్పుడు ద్రావణం వారి మీద స్ప్రే చేస్తారు. దాంతో శరీరంపై కరోనా వైరస్ ఉంటే చనిపోతుంది. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతే దీన్ని వాడుకలోకి తీసుకువచ్చారు. ఈ టన్నెల్ తయారీకి సుమారు రూ.90 వేల వరకు ఖర్చయింది. 16 గంటల పాటు నిరంతరాయంగా పిచికారీ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తమిళనాడులోని ఇతర జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story