రాజ్యసభ ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా

X
TV5 Telugu4 April 2020 8:56 AM GMT
దేశవ్యాప్తంగా ఈనెల 24 న 18 స్థానాల్లో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను గత నెల 26 న జరపాల్సి ఉన్నా కరోనా వైరస్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న వాయిదావేస్తూ ప్రకటన జారీ చేసింది.
ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై మరోసారి సమీక్ష జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇంకా కొన్ని రోజులు వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని ఈసీ వివరించింది. కాగా మొత్తం 55 స్థానాలకు గాను 37 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నిక పూర్తయింది. కాగా మరో ఎన్నిక జరగాల్సి ఉంది.
Next Story