వారిపై చర్యలు తప్పవు: ఎస్‌బీఐ

వారిపై చర్యలు తప్పవు: ఎస్‌బీఐ

ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఎస్‌బీఐ కార్యకలాపాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ సొంత ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై బ్యాంకు తీవ్రంగా మండిపడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజూవారీ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. బ్యాంకు అప్రతిష్టకు గురయ్యే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని అన్ని స్కరిళ్ల జనరల్‌ మేనేజర్లకు లేఖలు రాసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది.

Tags

Read MoreRead Less
Next Story