దారుణం.. పులి దాడిలో ఇద్ద‌రు మృతి

దారుణం.. పులి దాడిలో ఇద్ద‌రు మృతి
X

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అర్ధ‌రాత్రి ఓ పులి ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై దాడి చేసి చంపేసింది. అనంత‌రం వారి మృత‌దేహాల‌ను 500 మీట‌ర్ల దూరం వ‌ర‌కు లాక్కెళ్లింది. ఫిలిభిత్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

గ‌జ్రౌలా ఏరియాలోని రిచ్చౌలా చౌకీ గ్రామానికి చెందిన 50 ఏళ్ల నింద‌ర్ సింగ్ అత‌ని ద‌గ్గ‌ర జీతానికి ప‌నిచేసే 28 ఏళ్ల డోరీలాల్ వ్య‌వ‌సాయ బావి ద‌గ్గ‌ర పంట కావ‌లి కాస్తున్నారు. అయితే అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఒక పెద్ద‌పులి వారిపై దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ మృతి చెందారు. స‌మాచారం అందుకున్న అట‌వీ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని పులికోసం గాలించారు. మృత‌దేహాల‌కు కొంచెం దూరంలో చెట్ట‌పొద‌ల్లో దాగి ఉన్న పులిని గుర్తించి తుపాకీ ద్వారా ట్రాంక్విలైజ‌ర్ ఇచ్చారు. మ‌త్తులోకి జారుకున్న పులిని లక్నో జూకు త‌ర‌లించారు.

Next Story

RELATED STORIES