మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత

దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతొంటే మేఘాలయ బీజేపీ చీఫ్ మాత్రం మందు కావాలని విన్నపాలు చేస్తున్నారు. మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సీఎం కొన్రాడ్‌ కె. సంగ్మాకు శుక్రవారం మేఘాలయ బీజేపీ చీఫ్‌ ఎర్నెస్ట్‌ మారీ లేఖ రాశారు. వైన్ షాపు యజమానులు ప్రస్తుతం తీవ్ర ప్రజా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని మద్యం షాపులు తెరవాలని విపరీతమైన ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

"మేఘాలయ ప్రజలలో ఎక్కువ మందికి మితంగా మద్యం సేవించడం ఎల్లప్పుడూ జీవన విధానమే" అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఇంటికి మద్యం పంపిణీకి అనుమతి రద్దు చేసింది. ఆ తరువాతే ఎర్నెస్ట్‌ మారీ లేఖ రాయడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story