ప్రయోగం ఫలించింది.. వైరస్ మరణించింది..

ప్రయోగం ఫలించింది.. వైరస్ మరణించింది..

కరోనా వైరస్‌ను కట్టడి చేయాలి.. లేకపోతే ప్రపంచం మొత్తాన్ని మట్టు పెట్టేస్తుందని శాస్త్రజ్ఞులు రేయింబవళ్లు పరిశోధన శాలల్లోనే గడుపుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి కరోనా వైరస్ లేదా సార్స్-కోవ్-2 నిర్వీర్యం అయింది. 48 గంటల్లో వైరస్ వీగిపోయిందని యాంటీవైరల్ రీసెర్చ్ జర్నల్ తాజా సంచికలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఆస్ట్రేలియాలో జరిపిన ఈ పరిశోధనపై నివేదిక వెలువడింది.

పరీక్షనాళికలో వైరస్ ఎదగకుండా మానవ దేహంలో పరాన్న జీవులను హతమార్చేందుకు ఉద్దేశించిన 'ఐవర్‌మెక్టిన్' అనే మందు కరోనా వైరస్‌ను చంపేసింది. ఒకే ఒక్క డోసుతో 24 గంటల్లో వైరస్ తగ్గిపోయిందని, అదే 48 గంటల్లో అయితే ఈ మందు వైరస్‌ను పూర్తిగా అంతం చేసిందని.. నివేదిక సహ రచయిత ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన కైలీ వ్యాగ్‌స్టాఫ్ తెలిపారు.

ఈ మందు హెచ్ఐవీ, డెంగ్యూ, ఇన్‌ప్లూయంజా, జికా వైరస్ వంటి వాటిపై బాగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. అయితే తాము పరీక్షలు జరిపింది పరీక్ష నాళికలో మాత్రమే అని, దాన్ని మనుషులపై ప్రయోగించాల్సి ఉందని కైలీ అంటున్నారు. ఇంకా మరికొన్ని టెస్టులు.. క్లినికల్ ట్రయిల్స్, మరిన్ని సందేహాలు తీరిన తరువాతనే కరోనాను కంట్రోల్ చేసే మందు బయటికి వస్తుంది. అంతవరకు వెయిట్ అండ్ సీ.

Tags

Read MoreRead Less
Next Story