Top

8న అన్ని పార్టీల సభాపక్ష నేతలతో మోదీ భేటీ

8న అన్ని పార్టీల సభాపక్ష నేతలతో మోదీ భేటీ
X

కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అడుగు ముందుకేశారు. ఈ నెల 8వ తేదీన పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి ప్రకటన విడుదల చేశారు. అందులో "గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఏప్రిల్ 8 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజకీయ పార్టీల నాయకులతో సంభాషించనున్నారు" అని అని ప్రకటనలో తెలిపారు.

ఏప్రిల్‌ 8వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని.. ఈ సమావేశానికి 5 మందికి పైగా ఎంపీలున్న పార్టీలను ఆహ్వానిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, దాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ తదితర అంశాలపై చర్చించనున్నారు.

Next Story

RELATED STORIES