దారుణం.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

దారుణం.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
X

లాక్‌డౌన్ సమయంలోనూ బాలికలపై అఘాయిత్యాలకు అడ్డు పడటం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నోయిడా సాలాపూర్‌లోని గౌతమబుద్ధ నగర్‌ చెందిన 19 ఏళ్ల యువకుడు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేశాడు. బాలిక మరణించిందని భావించిన అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం గుర్తించిన స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరిలించారు.

Next Story

RELATED STORIES