ప్రధాని మోదీ మరో టాస్క్..

ప్రధాని మోదీ మరో టాస్క్..
X

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు భారతీయులందరినీ ఏకం చేస్తూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నారు. నిన్న దీపాలు వెలిగించడం ఒకటైతే.. ఈరోజు (ఏప్రిల్ 6) బీజేపీ వ్యవస్థాక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరికీ మోదీ మరో టాస్క్ ఇచ్చారు. మీరంతా ఒకపూట భోజనం మానేయండి.. ఈ సూచనను పార్టీలో ప్రతిఒక్కరూ ఆచరించేలా చూడండి అని కార్యకర్తలను కోరారు. పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో సామాజిక దూరం పాటించాలని మోదీ మరోసారి గుర్తు చేశారు. ఎందరో కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈ రోజు పార్టీ ఈ స్థాయికి చేరుకుందని, ప్రజలకు సేవ చేసే అవకాశం భాజాపాకు కలిగిందని అన్నారు.

పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మాట్లాడుతూ ప్రధాని వ్యాఖ్యలను కార్యకర్తలందరు పాటించాలని అన్నారు. 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరు మరో ఇద్దరికి మాస్క్‌లు ఇవ్వాలని సూచించారు. ఇంతటి కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story

RELATED STORIES