'బిగ్ బి' భారీ సాయం.. లక్ష కుటుంబాలకు..

బిగ్ బి భారీ సాయం.. లక్ష కుటుంబాలకు..
X

లాక్‌డౌన్ కారణంగా జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు వ్యక్తులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి 25 కోట్ల భారీ సాయాన్ని అందించి అక్షయ్ కుమార్ అగ్రభాగాన నిలిచారు. తాజాగా బిగ్ బీ మరో అడుగు ముందుకు వేసి ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్ష కుటుంబాలకు నెలవారీ రేషన్‌ అందిస్తానని ప్రకటించారు. అమితాబ్ చేస్తున్న ఈ సాయానికి సోనీ పిక్చర్స్, కళ్యాణ్ జ్యువెలరీ సంస్థలు మద్దతు తెలిపాయి. తామూ ఈ సాయంలో భాగం పంచుకుంటామని అన్నారు.

సోనీలో ప్రసారమయ్యే కైన్ బనేగా కరోడ్‌పతికి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక కళ్యాణ్ జ్యూవెలర్స్‌కి అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్. కాగా, కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించే దిశగా బచ్చన్ ఫ్యామిలీ అనే లఘు చిత్రంలో నటించారు. దీనికి ప్రసేన్ పాండే దర్శకత్వం వహించారు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. ఇంటి వద్దనే ఉండడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించడం గురించిన కథాంశం 'ఫ్యామిలీ'. ఈ చిత్రంలో రజనీకాంత్, రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి, సోనాలి కులకర్ణి, శివ రాజ్ కుమార్, ప్రోసేంజిత్ ఛటర్జీ మరియు దిల్జిత్ దోసంజ్ నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఏప్రిల్ 6న సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతుంది.

Next Story

RELATED STORIES