విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం ప్రకటన

విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం ప్రకటన
X

విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 14న లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వీటి పై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. విద్యాసంస్థల ఎప్పుడు పునఃప్రారంభించాలనేది 14న చెబుతామని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే తమకు అత్యంత ప్రధానమైన విషయమని పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా విద్యాసంస్థల మూత కొనసాగినా విద్యార్థులను నష్టపోనివ్వమని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత మిగిలిన పరీక్షలతోపాటు ఎవాల్యుయేషన్ కొనసాగించే యోచనలో ఉన్నట్టు మంత్రి వివరించారు.

Next Story

RELATED STORIES