త‌మిళ‌నాడులో ఆదివారం ఒక్క‌రోజే 86 మందికి క‌రోనా

త‌మిళ‌నాడులో ఆదివారం ఒక్క‌రోజే 86 మందికి క‌రోనా
X

త‌మిళ‌నాడులో క‌రోనా వేగంగా వ్యాప్తిస్తుంది. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 86 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాదు. వీరిలో 85 మంది మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ మ‌త‌ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వారేన‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి బీలా రాజేష్ తెలిపారు.

ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జ‌మాత్ నిర్వ‌హించిన మ‌త ప్రార్థ‌న‌లు త‌మిళ‌నాడు స‌హా అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. త‌మిళ‌నాడులో ఇప్పటి వరకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 571 కి చేరింది. ఈ 571 కేసుల్లోనూ 522 మంది ఢిల్లీ మ‌త ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారే కావటం విశేషం.

Next Story

RELATED STORIES