ఇంట్లోనే 'మాస్క్' తయారు చేసుకోండి ఈజీగా

ఇంట్లోనే మాస్క్ తయారు చేసుకోండి ఈజీగా
X

ఇంతకు ముందు రూ.5లకే దొరికే మాస్క్ కరోనా కారణంగా రూ.20 నుంచి రూ.50లకు అమ్మేస్తున్నారు. అసలు కొన్ని మెడికల్ షాపుల్లో అయితే అవుటాఫ్ స్టాక్ బోర్డ్ కనిపిస్తోంది. మాస్క్లులు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట అంత రేటు పెట్టి కొన్నా ఒక్కసారి వాడగానే పడేయాల్సి వస్తుంది. అదే ఇంట్లో మనం తయారు చేసుకున్నవి అయితే శుభ్రంగా వేడి నీటిలో కొద్ది సేపు ఉంచి ఎండలో ఆరబెడితే మళ్లీ వాడుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి రెండేసి చొప్పున మాస్కులు ఉంటే మంచిది. ఎవరిది వారే వాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

వాడని టీ షర్ట్, కాటన్ చున్నీలు, హ్యాండ్ కర్చీఫ్‌లు ఇలా వేటితో అయినా మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. టీ షర్ట్‌తో మాస్క్ కుట్టుకోవాలంటే షర్ట్ కింది భాగంలో 7నుంచి 8 అంగుళాలకు పైకి కట్ చేసుకోవాలి. ఒక వైపు ఓపెన్ చేసి ముక్కు, నోరు కవర్ చేసేంత వరకు ఉంచి పైన కింద తాళ్లలా వచ్చేలా చూసుకుని క్లాత్ మధ్య నుంచి చివరి వరకు కట్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న మాస్కును ఒకసారి వాడిన వెంటనే వాష్ చేయాలి. మాస్క్ ధరించే ముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.

Next Story

RELATED STORIES