ఈనెల 14 తరువాత లాక్ డౌన్ సడలిస్తారా లేక పొడిగిస్తారా..?

ఈనెల 14 తరువాత లాక్ డౌన్ సడలిస్తారా లేక పొడిగిస్తారా..?
X

ఈనెల 14 తరువాత లాక్ డౌన్ సడలిస్తారా లేక పొడగిస్తారా..? దేశవ్యాప్తంగా ఇప్పుడు దీనిపైనే చర్చ జరుసుగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మరోవారం నిర్బంధాన్ని పొడిగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.. ఒకవేళ ఇదే జరిగితే దాదాపు నెలరోజుల లాక్ డౌన్ వున్నట్టవుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పేదలు, సామాన్యులు డబ్బులేక అల్లాడిపోతారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఈ నెల 14 లోపే కరోనా టెస్టులు పూర్తి చేసి లక్షణాలు వున్నవారందరిని క్వారంటైన్ కు పంపాలని కేంద్రం సూచిస్తోంది. అందుకు తగ్గట్టే వేగంగా పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతానికి పొడిగింపు ఉద్దేశం లేదని చెబుతున్న కేంద్రం 14న దీనిపై సమీక్ష తరువాత దీనిపై తుది నిర్ణయం ప్రకటించనుంది.

అటు సర్వీసుల పునరుద్ధరణకు రైల్వే, విమానయాన రంగాలు సిద్ధమయ్యాయి.ముందస్తు రిజర్వేషన్లు కూడా జరుగుతున్నాయి. అంతేకాదు దశల వారీగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతిచే అవకాశం ఉంది. అయితే టికెట్ బుకింగ్ తీసుకుంటున్న కేంద్రం ప్రకటన ఆధారంగా తిరుగుతాయా? లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అటు లాక్ డౌన్ ఎదుర్కొనేందుకు కేంద్రం మరో ప్యాకేజి ప్రకటించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే రాష్ట్రాల మధ్య నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతోంది. అవసరమైన సిబ్బంధి కొరత లేకుండా చూసుకోవాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Next Story

RELATED STORIES