లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగాల పరిస్థితి?

లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగాల పరిస్థితి?
X

లాక్‌డౌన్ కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. 21 రోజులు ఇంటికే పరిమితం. అందరికీ వర్క్ ఫ్రం హోం వెసులు బాటు ఉండదు. కొన్ని కంపెనీలు మూత పడ్డాయి. కొన్ని కంపెనీలు మాత్రం పరిమిత ఉద్యోగులతో రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ లోటును భర్తీ చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) స్పష్టం చేసింది.

గతవారం 200 మందికి పైగా కంపెనీల సీఈఓలతో సంస్థ ఓ సర్వే చేసింది. అనేక రంగాల్లో ఉద్యోగ కోతలు ఉండవచ్చని 52 శాతం మంది సీఈఓలు స్పష్టం చేశారు. పరిశ్రమలపై కోవిడ్ 19 ప్రభావం- సీఈఓల స్నాప్ పోల్ పేరిట సీఐఐ గతవారం ఓ సర్వే నిర్వహించింది. అయితే ఉద్యోగ కోతలు 15 శాతం కంటే తక్కువే వుంటాయని 47 శాతం మంది అంటే, 15 నుంచి 30 శాతం వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని మరో 32 శాతం మంది చెప్పారు. ఇదిలావుండగా పరిశ్రమల అభివ‌ృద్ధి కోసం ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని అందించే అవకాశం ఉండొచ్చని సీఐఐ డైరక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES