కరోనా బాధితులకి సేవ చేస్తున్న వారికి రూ. 50 లక్షల బీమా

కరోనా బాధితులకి సేవ చేస్తున్న వారికి రూ. 50 లక్షల బీమా

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులు, రెవెన్యూ, పట్టణాభివృద్ధి విభాగ అధికారులకు 50 లక్షలు భీమా సౌకర్యం ప్రకటించింది. కరోనాపై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. వైద్య సిబ్బందికి, పోలీసులు.. కరోనా బాధితుల కోసం సేవ చేస్తున్నారు. అందుకే.. దేశంలో అన్ని వర్గాల వారికి జీతాల్లో కోత విధించినా.. వైద్య సిబ్బందికి, పోలీసులకు మాత్రం విధించలేదు. అటు.. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు గత వారం కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రం ప్రకటించిన దానికి ఇది అదనం అని తెలిపింది. వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, మరికొందరికి ఈ బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు.

కాగా.. మధ్యప్రదేశ్‌లో 256 కేసులు నమోదయ్యాయి. వీటిలో 23 కేసులు 12 గంటల వ్యవధిలోనే వెలుగుచూశాయి. ఇండోర్‌లో అత్యధికంగా 151 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story