బన్నీ,సుకుమార్, 'పుష్ప'.. టైటిల్ అదే!!

బన్నీ,సుకుమార్, పుష్ప.. టైటిల్ అదే!!
X

లెక్కల మాష్టర్ సుకుమార్ చిత్రాలంటే అభిమానులకు ఆసక్తి. సినిమా చివరి వరకు సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ చిత్రాలు తీసే సుకుమార్‌తో సినిమా చేయడమంటే హీరోలకూ పండగే. ఆయన పెట్టే టైటిల్స్ కూడా అంతే ఆసక్తిదాయకంగా ఉంటాయి. రంగస్థలం అని రామ్ చరణ్, సమంత కాంబినేషన్లో చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన ఆయన.. తాజాగా అల్లుఅర్జున్, రష్మిక మందనతో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పేరు పుష్ప అని, ఆమె పేరే టైటిల్ అని సమాచారం. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని కూడా రంగస్థలం మాదిరిగానే ఓ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

Next Story

RELATED STORIES