ఒకే కుటుంబంలోని ఆరుగురికి కరోనా..

కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయగా అందరికీ పాజిటివ్ అని తేలింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన వీరికి వైరస్ సోకిందని తేలడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, SP భాస్కరన్ హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. ప్రజలెవ్వరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని మంత్రి హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలను భయాందోళనకు గురికావద్దని తెలిపారు. గ్రామంలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామం మొత్తానికి ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com