మీ వల్లే మాకీ కరోనా.. మాకొద్దీ టిక్ టాక్.

మీ వల్లే మాకీ కరోనా.. మాకొద్దీ టిక్ టాక్.

చైనా వదిలిన టిక్‌టాక్‌ని ప్రపంచంలో 800 మిలియన్ల మంది వాడేస్తుంటే అందులో సగం మంది భారతీయులే ఉండడం విశేషం. పొద్దున్న లేస్తే టిక్‌టాకుల్లో గడిపేస్తోంది నేటి యువత. వినోదంతో పాటు కొంత విజ్ఞానాన్ని అందిస్తున్న టిక్ టాక్ భారతీయుల జీవితాల్లో మమేకమైపోయింది. అయినా భారమైన మనస్సుతో ఇప్పుడు మాకొద్దీ టిక్ టాక్ అని గొంతెత్తి అరుస్తోంది. మాకందరికీ కరోనాని అంటించి మా జీవితాలతో ఆడుకుంటారా అని చైనా మీద ఒంటి కాలిపై లేస్తున్నారు. చైనా ఉత్పత్తులు బ్యాన్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కరోనా వైరస్‌ను చైనా వైరస్ అని సంబోధిస్తున్నారు. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే 209 దేశాలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నాయి. భారత్ కనుక టిక్ టాక్ బ్యాన్ చేస్తే చైనా రోజుకి 1 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతుంది. 250 మంది చైనీయులను తమ ఉద్యోగాలను కోల్పోతారని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story