కరోనా కట్టడిపై ప్రధానికి సోనియా గాంధీ 5సూచనలు

కరోనా కట్టడిపై ప్రధానికి సోనియా గాంధీ 5సూచనలు

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 5 సూచనలు చేశారు. ఈ మేరకు సోనియాగాంధి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

రూ .20,000 కోట్ల సెంట్రల్ విస్టా బ్యూటీఫికేషన్, నిర్మాణ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని ఆమె ప్రధానిని కోరారు. "కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన నిధులను విడుదల చెయ్యాలని కోరారు.. ఎంపీల జీతాల కోతకు మద్దతు పలికిన సోనియా గాంధీ.. ఈ సూచనలలో, టీవీ, ప్రింట్ మరియు ఆన్‌లైన్ - మీడియాకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలను రెండేళ్లపాటు పూర్తిగా నిషేధించాలని సోనియా గాంధీ కోరారు.

అంతేకాదు ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకోవాలని, కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని తెలిపారు. పీఎం కేర్స్ నిధులను, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించారు. కాగా కరోనావైరస్ వ్యాప్తిపై దేశం యొక్క ప్రతిస్పందనపై చర్చించడానికి ప్రధాని మోడీ ఆదివారం ఇద్దరు మాజీ రాష్ట్రపతులు , ఇద్దరు భారత మాజీ ప్రధానమంత్రులను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ కు ప్రధాని నేరుగా ఫోన్ చేసి సలహాలు అడిగారు.

Tags

Read MoreRead Less
Next Story