ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా.. వైరస్ పుట్టింది అక్కడే..

ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా.. వైరస్ పుట్టింది అక్కడే..

కరోనావైరస్ మొదటి కేసు " 2019 డిసెంబర్ చివరలో" వుహాన్ నగరంలో కనుగొనబడింది అని చైనా ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇన్ని రోజులు ఈ ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్న చైనా మొదటిసారి ఈ విషయంపై ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలు, ప్రజల విమర్శల అనంతరం.. కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ లో ఉద్భవించిందని.. దీనిని డిసెంబర్ నెలలో కనుగొనబడిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

కాగా కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి, ఈ మహమ్మారి చైనాలో 3,331 మందిని బలితీసుకుందని, దేశంలోఅంటువ్యాధుల సంఖ్య 81,740 కు పెరిగిందని జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) మంగళవారం తెలిపింది. మొత్తం 1,299 మంది రోగులు ఇంకా చికిత్స పొందుతున్నారు, కోలుకున్న తర్వాత 77,078 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

కాగా ప్రాణాంతకమైన COVID-19 ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించి, 75,945 మందిని పొట్టనపెట్టుకుంది. 180 కి పైగా దేశాలు మరియు భూభాగాలలో 1.3 మిలియన్ల మందికి పైగా సోకినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story