భారత్‌లో 124కి చేరిన కరోనా మృతులు

భారత్‌లో 124కి చేరిన కరోనా మృతులు
X

భారత్ లో కరోనా కలవరం పెడుతూనే ఉంది. తాజాగా, మరణాలు, కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం నాటికి కరోనా మరణాల సంఖ్య 124 కు చేరుకుంది. అంతేకాదు కేసుల సంఖ్య కూడా 4,789 కు పెరిగిందని మంగళవారం సాయంత్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలను వెల్లడించింది. మొత్తం కేసులలో, 4,312 క్రియాశీల కేసులు కాగా, 352 నయమయ్యాయి.. ఒకటి మైగ్రేటెడ్ కేసు ఉందని వెల్లడించింది. ప్రస్తుతానికి, దేశం కరోనావైరస్ మహమ్మారి యొక్క స్టేజ్ 2 మరియు 3 మధ్య ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Tags

Next Story