Top

లాక్ డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో CRDA అధికారుల హల్ చల్

లాక్ డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో CRDA అధికారుల హల్ చల్
X

లాక్ డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో CRDA అధికారులు హల్ చల్ చేస్తున్నారు. నిన్న నీరుకొండ, ఐనవోలు.. ఇవాళ నీరుకొండలో అధికారులు పర్యటన చేస్తున్నారు. CRDA అధికారుల పర్యటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. లాక్ డౌన్ సమయంలో రాజధాని గ్రామాల్లో CRDA అధికారుల పర్యటనతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. అధికారులు రావడాన్ని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ లోని రెసిడెన్షియల్ జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణ నోటీసులు ఇచ్చేందుకు తాము వచ్చామని CRDA అధికారులు చెబుతున్నారు. అయితే రాజధాని కోసం ఇచ్చిన భూమిని పేదలకు పంచే విషయమై హైకోర్టు స్టే ఇచ్చిందని రైతులు అంటున్నారు.

Next Story

RELATED STORIES