తాజా వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 7077 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్లన్నీ బంద్‌ కావడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కోసం రూ. 25 వేల కోట్లు, మొక్కజొన్నల కోసం రూ. 3213 కోట్లు కేటాయించింది.. ఇందులో

భాగంగా రైతులబ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి.

Next Story

RELATED STORIES