జాతీయం

ధర్మేంద్రకు ముందు ఆమె పెళ్లి మరో హీరోతో..

ధర్మేంద్రకు ముందు ఆమె పెళ్లి మరో హీరోతో..
X

డ్రీమ్‌గర్ల్ హేమా మాలిని ఆల్‌రెడీ పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రతో ప్రేమాయణం సాగిస్తోందని తెలిసి ఇంట్లో వాళ్లు చీవాట్లు పెట్టారు. ఇలా వదిలేస్తే లాభం లేదని మరో హీరో జితేంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడి అతడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల మాటకి ఒప్పుకుని తల వంచి తాళి కట్టించుకోవాలనుకుంది హేమా మాలిని. కానీ అప్పటికే జితేంద్ర కూడా శోభా కపూర్ అనే ఆవిడతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అయినా హేమను చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. చెన్నైలో పెళ్లి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి విషయాన్ని పేపర్లో చూసేంత వరకు దర్మేంద్రకు, శోభకు తెలియక పోవడం విశేషం. వార్త చదివిన వెంటనే చెన్నై వెళ్లారు ధర్మేంద్ర, శోభ.. జితేంద్ర, హేమ కుటుంబ సభ్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర హేమను తనను అన్యాయం చేయవద్దంటూ బతిమలాడుకున్నాడు. దీంతో పెళ్లికి మరి కొంత టైమ్ కావాలని హేమ తన కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇంకేముంది.. జితేంద్ర, హేమల పెళ్లి వాయిదా పడింది.. ఆతరువాత హేమ, ధర్మేంద్ర కలిసి నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. అనంతరం 1979 ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడు ధర్మేంద్ర.. అటు జితేంద్ర పెళ్లి 1974 అక్టోబర్ 18న తను ప్రేమించిన శోభా కపూర్‌తో అయింది. ఈ విషయాలన్నీ "హేమా మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గర్ల్" అనే పుస్తకంలో రాసుకొచ్చారు.

Next Story

RELATED STORIES