దోస్త్ మేరా దోస్త్.. ఇంకెప్పుడూ 'చైనా వైరస్' అని..

దోస్త్ మేరా దోస్త్.. ఇంకెప్పుడూ చైనా వైరస్ అని..

వైరస్‌ని అంటించిన వూహాన్‌లో కంటే అగ్రరాజ్యం అమెరికాలోనే కరోనా బాధితులు ఎక్కువవుతున్నారు. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరగడంతో అధినేత ట్రంప్ కలవరపాటుకు గురవుతున్నారు. అందుకే చైనా వైరస్ అని పదే పదే విమర్శిస్తూ చైనాపై తనకున్న కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. అలాంటిది మార్చి 26న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న ట్రంప్ ఒక్కసారిగా మారిపోయారట. మళ్లీ చైనా వైరస్ అనను అని ఆయనకు వాగ్ధానం చేశారట. పాత వైరాలు పక్కన పెట్టి దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి ఇప్పుడు చైనా, అమెరికాలు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సైతం ఇంతకు ముందు జీ-20 సదస్సులో వూహాన్ వైరస్ అనాలని పట్టుబట్టారు. కానీ ఇప్పుడు ఆయన కూడా.. కరోనా ఒక విశ్వ మహమ్మారి.. వైరస్ బాధిత దేశాలన్నీ కలిసి దీనిని ఎదుర్కోవాలి అని అంటున్నారు. అసలు ఏ ఒక్క జాతినీ కించ పరిచే విధంగా మాట్లాడ వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా పట్టించుకోని అగ్రరాజ్య అధినేతలు ఇప్పుడు చైనాతో రాజీ కుదుర్చుకున్నాయి. వైరస్‌కి కారణం మీరంటే మీరు అని వాదులాడుకున్న రెండు దేశాలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story