Top

బ్లాక్ లో మద్యం తరలిస్తున్న వైసీపీ నాయకుడు

బ్లాక్ లో మద్యం తరలిస్తున్న వైసీపీ నాయకుడు
X

దేశమంతా లాక్ డౌన్ తో మద్యం షాపులు మూతపడినా.. ఏపీలో అధికార పార్టీల నాయకులకు మాత్రం కేసులకు కేసులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలోని వైసీపీ నాయకుడి ఇంట్లో మద్యం దొరికింది. వైసీపీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి ఏకగ్రీవమైన పిడుగు శ్రీనివాసరెడ్డి తన కారులో మద్యం కేసులు తరలిస్తుండగా ఎక్ససైజ్ సీఐ, పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి దాచి పెట్టుకున్న మద్యం కేసులుగా తెలుస్తోంది. ఇంతలో కరోనా విజృంభించడం లాక్ డౌన్ అమలు చేయడంతో వైన్ షాపులు మూతపడ్డాయి. దీంతో మద్యానికి డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో వీటిని బ్లాకులో అమ్ముకునేందుకు శ్రీనివాసరెడ్డి తరలించడంతో దొరికిపోయాడు. అంతేకాదు ఈ మద్యాన్ని నాలు రేట్లు అధిక ధరకు అమ్మే ప్రయత్నం చేశాడు. మద్యం కేసులను సీజ్ చేశారు.

Next Story

RELATED STORIES