కరోనా వైరస్ నివారణకు టిటిడి నుంచి ఆయుర్వేదిక్ ఔషధం

కరోనా వైరస్ నివారణకు టిటిడి నుంచి ఆయుర్వేదిక్ ఔషధం

వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ముందుగా చేయవలసింది సామాజిక దూరం పాటించడం. దాంతో పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం వంటివి చేయాలి. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఆయుర్వేద ఔషధం అందించేందుకు టిటిడి చర్యలు తీసుకుంది. దేవస్థానానికి సంబంధించిన ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్షజ్ఞ ధూపం (క్రిమిసంహారక ధూపం), పవిత్ర (చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే లిక్విడ్), గండూషము (పుక్కిలించే మందు), నింబనస్యము (ముక్కులో వేసుకునే చుక్కల మందు), అమృత (వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్ర)లను తయారు చేశారు. ఈమందులను మంగళవారం రాత్రి టిటిడి జేఈవో పి. బసంత్‌కుమార్ వీటిని విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story