Top

సీఎం జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు

ప్రస్తుత విపత్తులో ప్రభుత్వం పట్టింపులు, కక్షా రాజకీయాలకు తావు లేకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కంపెనీల అంశాలను గుర్తుచేస్తూ.. ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసారాయన. విశాఖలోని మెడ్ టెక్ జోన్ సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం ముందు చూపుతో నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ లో రోజుకు రెండు వేల కరోనా టెస్టు కిట్ల తయారీ జరుగుతోందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం గత పది నెలలుగా మెడ్ టెక్ పై నిర్లక్ష్యం చూపిందని అన్నారు.

ఆ పది నెలలు ద్రుష్టి సారించి ఉంటే ఇప్పుడు దేశానికీ కావలసిన కిట్ లను తయారు చేసి సరఫరా చేసి ఉండేదని అన్నారు. అలాగే తమ హయాంలో అమలు చేసిన అన్నా క్యాంటీన్, చంద్రన్న భీమా పధకాలను కూడా పునరుద్ధరించాలని తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో అన్నా క్యాఆంటీన్ లు , భీమా పధకాలు ఎంతో అవసరమని కూడా సూచించారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లను మూసి వేయకుంటే రోజుకు లక్షలాది రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికుల కడుపు నిండేదని అన్నారు.

Next Story

RELATED STORIES