బయటకెళ్లడానికి బండి తీశారా.. బుక్కైపోతారు జాగ్రత్త

బయటకెళ్లడానికి బండి తీశారా.. బుక్కైపోతారు జాగ్రత్త
X

బాగా అవసరం అయితే తప్ప బయటకి వెళ్లకండి. పోలీసులు మిమ్మల్ని అనుక్షణం గమనిస్తున్నారు. ఇప్పుడు నిఘా మరింత పెంచారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం దాటితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందిపోతుంది. మీ వాహన నెంబర్ ప్లేట్ కెమెరాలో రికార్డవుతుంది.. కంట్రోల్ రూమ్‌కి చేరవేస్తుంది. ఈ ఫీడ్ ఆధారంగా నగర పౌరులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు లాంటి వివరాలు సేకరించి రికార్డు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారిని పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story

RELATED STORIES