తబ్లిగీ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ నేత

X
TV5 Telugu8 April 2020 6:38 PM GMT
తబ్లిగీ సభ్యులు ఇప్పటికైనా సమాజంలో బాధ్యత కలిగిన పౌరుల్లా వ్యవహరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ అన్నారు. తబ్లిగీ జమాత్ సదస్సు తరువాత దేశంలో వేగంగా కరోనా విస్తరించడం, తబ్లిగీ సభ్యులు వైద్యులు చికిత్స అందించే నర్సులపై అతిగా ప్రవర్తించడం వంటి ఘటనలపై మనీష్ తివారీ ట్వీటర్ లో స్పందించారు. తబ్లిగీ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. 'ఇప్పటికే చాలా డ్యామేజ్ చేశారు. ఇప్పటికైనా సమాజంలో బాధ్యత కలిగిన పౌరుల్లా వ్యవహరించండి' అంటూ మంది పడ్డారు.
దేవుడి బోధలు ప్రపంచానికి చెప్పాలనుకుంటే.. ముందు మీరు సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని ట్వీట్ చేశారు.
Next Story