నిద్ర మాత్రలు మింగిన దివంగత నటి మనోరమ కుమారుడు

నిద్ర మాత్రలు మింగిన దివంగత నటి మనోరమ కుమారుడు
X

మద్యానికి బానిసైన దివంగత నటి మనోరమ కుమారుడు.. మద్యం దొరక్కపోవడంతో నిద్ర మాత్రలు మింగారని రూమర్లు వస్తున్నాయి.. దాంతో మంగళావారం మనోరమ కుమారుడు భూపతిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నిద్ర మాత్రలు అధిక మోతాదు కారణంగా అస్వస్థతకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 7) సాయంత్రం, కుటుంబసభ్యులు, బంధువులు పిలుస్తున్నా స్పందించకుండా అతను మంచం మీద పడుకున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి అధికారులు అతనికి చికిత్స చేశారు, ఇప్పుడు, అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చెన్నైలోని మాంబలం పోలీస్ స్టేషన్ అధికారులు ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపారు.

టి నగర్ లోని మెహతా వీధిలో నివసిస్తున్న భూపతి(64) మద్యానికి బానిస అని రూమర్లు వస్తున్నాయి. కర్ఫ్యూ కారణంగా మద్యం షాపులు మూసివేయబడినందున, అతను మత్తు వ్యసనంతో పోరాడుతున్నాడు, ఈ కారణంగా అతను అధిక మోతాదులో నిద్ర మాత్రలు తిన్నాడు. స్లీపింగ్ మాత్రలు అధికంగా తీసుకొని భూపతి ఆసుపత్రి పాలయ్యాడనే వార్త తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Next Story

RELATED STORIES