పాకిస్తానీ వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందించండి: రాజస్థాన్ సీఎం

పాకిస్తానీ వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందించండి: రాజస్థాన్ సీఎం
X

రాజస్థాన్‌లోని పాకిస్తాన్ వలస కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పాకిస్తానీ నుండి వచ్చిన దాదాపు 7,000 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ నిర్ణయంతో వారంతా.. లబ్ధి చెందుతారని అన్నారు.

జోధ్‌పూర్ కు చెందిన హిందూ సింగ్ జోధ్ అనే.. ఓ సామాజిక కార్యకర్త సీఎం గెహ్లాట్‌కు లేఖ రాశారు. రాష్టంలో ఉన్న పాకిస్తాన్ వలస కార్మికులు లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు. దీనిపై వెంటనే స్పందించిన గెహ్లాట్.. ఆ కుటుంబాలకు సాయం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Next Story

RELATED STORIES