మ‌హిళ‌లంద‌రూ ధైర్యంగా ఉండాలి : స‌్మృతి ఇరానీ

మ‌హిళ‌లంద‌రూ ధైర్యంగా ఉండాలి : స‌్మృతి ఇరానీ
X

మహిళలు స్వీయభద్రత విషయంలో ఆందోళనలో ఉన్నారని.. మహిళల్లో మనోధైర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హెచ్చార్డీలోని వివిధ విభాగాల ఇన్‌చార్జిల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆమె మ‌హిళ‌ల‌ల్లో భ‌రోసా నింపే ప్రయత్నం చేశారు. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కోన్నారు.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో గృహహింస కేసులు రెట్టింప‌య్యాయని, మహిళల మానసిక, సామాజిక భద్రత విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు.. త‌మ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు రానీయ‌ద‌ని, మ‌హిళ‌లంద‌రూ ధైర్యంగా ఉండాలని ఆమె సూచించారు.

Next Story

RELATED STORIES