ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సోనాలి షేర్ చేసిన సీక్రెట్ ఫార్ములా

ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సోనాలి షేర్ చేసిన సీక్రెట్ ఫార్ములా
X

ప్రపంచమంతా కనిపించని కరోనాతో ఫైట్ చేస్తోంది. ఈ వైరస్ నివారణకు మందులేవీ లేవు.. ముందు జాగ్రత్త చర్యలు తప్ప. అందుకే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి అని అంటున్నారు బాలీవుడ్ నటీమణి సోనాలీ బింద్రే. అనేక తెలుగు చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు సోనాలి. క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రజల్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ.. తను పాటిస్తున్న మూడు ఆరోగ్య సూత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఒకటి.. తరచుగా ఆవిరి పడుతుండాలి. రెండు.. గోరు వెచ్చని నీళ్లు తాగుతుండాలి. మూడు.. ఆపిల్, క్యారెట్, అల్లం, మంచి పసుపు, బాదం, ఉసిరి వంటి వాటిని ఉపయోగించి జ్యూస్ చేసుకుని తాగడం. అందరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సోనాలి సూచించారు.

Next Story

RELATED STORIES