కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ట్విట్టర్ సీఈఓ అతిపెద్ద సాయం

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ట్విట్టర్ సీఈఓ అతిపెద్ద సాయం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రపంచ బిలియనీర్లు ముందుకు వస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే భారీ సాయం ప్రకటించారు. పరిశోధనలు, వైద్యానికి గాను 1 బిలియన్ (7,600 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు "గ్లోబల్ కోవిడ్ -19 ఉపశమనం కోసం" స్టార్ట్ స్మాల్ అనే ఛారిటబుల్ ఫండ్‌కు 1 బిలియన్ల స్క్వేర్ షేర్లను బదిలీ చేశారు.. కరోనా కట్టడికి ఇంతపెద్దమొత్తంలో సహాయాన్ని అందించడం ఇదే ప్రధమం.. జాక్ డోర్సే తన సంపాదనలోని 28 శాతం ఇస్తున్నారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డోర్సీకి సుమారు 9 3.9 బిలియన్ల సంపద ఉన్నట్టు అప్పట్లో లెక్కగట్టింది. ఇక వీరితోపాటు అమెజాన్ వ్యవస్థాపకుడు, జెఫ్ బెజోస్ అమెరికాకు 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అలాగే బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి అలాగే చికిత్సలకు 100 మిలియన్ డాలర్లు ఇచ్చారు. డెల్ కంప్యూటర్ల వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ 100 మిలియన్ డాలర్ల భారీ సాయాన్ని అందించారు.

Tags

Read MoreRead Less
Next Story