Top

అందనంత ఎత్తులో అక్షయ్.. మరో రూ.3కోట్లు..

అందనంత ఎత్తులో అక్షయ్.. మరో రూ.3కోట్లు..
X

కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు, లాక్‌డౌన్ కారణంగా పని కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో పెద్ద మొత్తంలో విరాళం రూ.25 కోట్లు అందజేసిన వ్యక్తిగా అక్షయ్ కుమార్ రికార్డులకు ఎక్కారు. తాజాగా మరో రూ.3 కోట్లు ముంబై మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌కు అందజేశారు. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లలో ఉన్నా.. మున్సిపల్ కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తూ వారి ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. అందుకే వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రేమతో ఆ డబ్బుని ఇచ్చినట్లు అక్షయ్ ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES