పాకిస్థాన్‌లో ఒకేరోజు 248 కరోనా పాజిటివ్ కేసులు

X
TV5 Telugu9 April 2020 11:48 PM GMT
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విజృంభిస్తుంది. పాకిస్థాన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,322కు చేరింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారని పాక్ వెల్లడించింది. అయితే దేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేస్తే వారంతా ఆకలితో చనిపోతారని పాక్ ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు.
Next Story