రోడ్డు మీద రూ.500 నోట్లు.. వారిపనే అని..

రోడ్డు మీద రూ.500 నోట్లు.. వారిపనే అని..
X

అనుమానం పెనుభూతం అని అంటారు కానీ.. ఏమో ప్రస్తుత పరిస్థితుల్లో ఏది ముట్టుకున్నా కరోనా వస్తుందేమో అని ప్రతి ఒక్కరూ భయం భయంగా బతకాల్సి వస్తోంది. కరోనా మరి అలా కలవరపెడుతోంది. రోడ్డు మీద కరెన్సీ నోట్లు కనబడితే తీసి జేబులో వేసుకోకుండా ఎవరుంటారు. కానీ లఖ్‌నవూలో మాత్రం ఎవ్వరూ ఆ నోట్లను ముట్టుకునే సాహసం చేయలేదు. స్థానికులకు రెండు రూ.500 నోట్లు కనిపించాయి. వాటిని చూసి దూరం జరిగారు. కరోనా సోకిన వ్యక్తే వాటిని అక్కడ పడేసి ఉంటాడనే అనుమానం వారిని వెంటాడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దగ్గరలోని వైద్యుడిని కలిసి విషయం వివరించగా 24 గంటలపాటు ఆ నోట్లను దూరంగా ఉంచాలని చెప్పారు. నోట్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో స్థానికులు భయపడి ఉంటారని పోలీసులు అంటున్నారు.

Next Story

RELATED STORIES