పాజిటివ్ వ్యక్తి కోలుకున్నాడు.. అతడిని కలిసిన చిన్నాన్న మాత్రం..

పాజిటివ్ వ్యక్తి కోలుకున్నాడు.. అతడిని కలిసిన చిన్నాన్న మాత్రం..

కరోనా వైరస్ సోకిందని తెలుసుకుని చికిత్స తీసుకుంటే ప్రాణాలు నిలుస్తున్నాయి. ఒకవేళ వైరస్ సోకిన విషయం గుర్తించలేకపోతే మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌కు చెందిన హిమాన్షు ఉత్తమ్ చందాని (37)తన కుటుంబ సభ్యులతో కలిసి మార్చి రెండో వారంలో టర్కీలో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యాడు. వేడుకలకు అతడి చిన్నాన్న మోహన్ (71), పిన్ని కూడా స్పెయిన్ నుంచి వచ్చారు.

శుభకార్యం పూర్తయిన అనంతరం వాళ్లు స్పెయిన్ వెళ్లి పోయారు. హిమాన్షు జోధ్‌పూర్ వచ్చేశారు. టర్కీ నుంచి వచ్చిన తరువాత అతడి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్‌కు వెళితే కరోనా టెస్టులు చేశారు. రిపోర్ట్ పాజిటివ్‌గా రావడంతో అతడితో పాటు కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. 14 రోజుల అనంతరం ఏప్రిల్ 6న హిమాన్షుని డిశ్చార్జి చేశారు. ఇదిలాఉండగా, చిన్నాన్న మోహన్‌కు 4, 5 రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేదని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

వైద్యులు అతడిని పరిక్షించి కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్నారు. ఇంట్లోనే ఉండి గృహనిర్భంధం పాటించమంటూ మందులు వాడమని పంపించి వేశారు. కానీ అతడి ఆరోగ్యం రోజు రోజుకి మరింత క్షీణించడంతో మార్చి 31న మళ్లీ హాస్పిటల్‌‌కు తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే అతడిని ఐసీయూలో ఉంచారు. కానీ అప్పటికే పరిస్థితి దిగజారిపోయింది. ఏప్రిల్ 6న అతడి ఆరోగ్యం మరింత క్షీణించి మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story