పలు ప్రైవేట్ కాలేజీలపై కొరడా ఝుళిపించిన అమరీందర్ సింగ్ ప్రభుత్వం

పలు ప్రైవేట్ కాలేజీలపై కొరడా ఝుళిపించిన అమరీందర్ సింగ్ ప్రభుత్వం

పలు ప్రైవేట్ కాలేజీలపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దేశ వ్యాప్తంగా ఓ పక్క లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. మరో పక్క ఆ కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు డిమాండ్ చేస్తుండటంతో వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు విద్యామంత్రి విజయ్ ఇందర్ సింగ్లా మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 38 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. వారం రోజుల్లోగా వారి స్పందన తెలియజేయాలన్నారు. సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే.. ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని ఇందర్ సింగ్లా స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో రవాణా ఖర్చులతో పాటు పుస్తకాల ఫీజులను సైతం వసూలు చేయకూడదని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story