'యెమన్' లో కరోనావైరస్ మొదటి కేసు

యెమన్ లో కరోనావైరస్ మొదటి కేసు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. దీని భారిన పడి 95,765 మంది మరణిస్తే.. 1,605,683 కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య మాత్రం 356,968 గా ఉంది. ఇందులో చైనా, అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. ఇదిలావుంటే యెమన్ దక్షిణ ప్రావిన్స్‌లో మొదటి కరోనావైరస్ కేసును శుక్రవారం నివేదించింది.. ఈ విషయాన్నీ COVID-19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ అత్యవసర కమిటీ తెలిపింది.

మిగతా దేశాలతో పోల్చితే జర్మనీ, అమెరికాలో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. జర్మనీలో ధృవీకరించబడిన కోవిడ్ -19 అంటువ్యాధుల సంఖ్య గత 24 గంటల్లో 5,323 పెరిగి శుక్రవారం 113,525 కు చేరుకుంది. మరోవైపు కరోనావైరస్ మహమ్మారి 16,000 మంది అమెరికన్ల ప్రాణాలను బలిగొంది.. అంతేకాదు 4.6 లక్షలకు పైగా ఈ వైరస్ సోకింది, కోవిడ్ వ్యాధి అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.. కేవలం మూడు వారాల్లో రికార్డు స్థాయిలో 16 మిలియన్ల మంది కార్మికులను నిరుద్యోగుల్ని చేసింది.

Tags

Read MoreRead Less
Next Story