అగ్రరాజ్యం అమెరికాపై కరోనా కక్ష.. అత్యధిక మరణాలు అక్కడే..

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా కక్ష.. అత్యధిక మరణాలు అక్కడే..


అన్నింట్లో మాదే పైచేయి అని అనుకునే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్‌ను ఎదుర్కోలేక సతమతమవుతోంది. రోజు రోజుకు లెక్కకు మించిన పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 4,28,703 మందికి పాజిటివిగా తేలి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిల 16,679 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే 1,917 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వైరస్ మహమ్మారి అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. గత మూడు వారాల్లో దాదాపు 16 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడిన వారిలో 30 శాతం మంది అమెరికాలోనే ఉన్నట్లు తేలింది. 17 శాతం మరణాలు అమెరికాలోనే సంభవించాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో నిన్న ఒక్కరోజే 800 మంది మృతి చెందారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కేసుల సంఖ్య 16 లక్షలకు పైగా ఉన్నాయని సమాచారం. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story