ఆఫ్ఘాన్ అధ్యక్షభవనంలో 20 మందికి కరోనా..

ఆఫ్ఘాన్ అధ్యక్షభవనంలో 20 మందికి కరోనా..

చెత్తా చెదారం.. మురికి ప్రదేశాలు.. అపరిశుభ్ర వాతావరణంలోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని మనం చదువుకున్నాం.. విన్నాం.. కానీ ఇదేం వైరస్.. నాకు ఆ ప్లేసు ఈ ప్లేసు అని లేదు అని ఎక్కడికైనా ఎగురుకుంటూ వచ్చేస్తోంది. అంతమంది సెక్యూరిటీ ఉన్నా అధికారుల అధ్యక్షభవనాల్లోకీ ఠీవీగా వెళిపోతోంది. మొన్నటికి మొన్న బ్రిటన్ అధ్యక్షుడికి, నిన్న సౌదీ రాజకుటుంబంలోని సభ్యులకీ వచ్చి వాళ్లనీ పీడిస్తోంది.

తాజాగా ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ అని గుర్తించారు. దీంతో అక్కడ పని చేస్తున్న మిగతా సిబ్బంది నుంచి, అధికారుల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని కరోనా నిర్ధారణ టెస్టులకు పంపించారు. కాగా, ఆఫ్ఘాన్‌లో శుక్రవారం కొత్తగా మరో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 521 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆదేశ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story