కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారు..

కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారు..

కరోనా.. ఇది నీకు తగునా.. ఎంత మంది ప్రాణాలు తీస్తావు. అసలెక్కడ ఉన్నావు. కనిపించకుండా కాటేస్తున్నావు. ఇంకెంతమందిని మృత్యువొడికి చేరుస్తావు. రోజూ వందల సంఖ్యలో కరోనా కాటుకు బలవుతున్నారు. వేల కుటుంబాల్లో అంతులేని విషాదం. ఆఖరికి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని పరిస్థితి. భగవంతుడా మళ్లీ జన్మ ఉంటే మనిషిగా వద్దు.. బంధాలు అనుబంధాలు ఏర్పరచి ఆఖరికి ఇలా దూరం చేస్తావు. అణుబాంబులు సృష్టించిన చేతులు కరోనా వైరస్‌ను కట్టడి చేయలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయపరిస్థితిలో ప్రపంచం ఉంది. వేల మందిని ఆసుపత్రికి పరిమితం చేసింది.

ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 1,02,136 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారిన పడిన వారిసంఖ్య 16,84,833 మంది కాగా.. వీరిలో 12,07,198 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 3,75,499 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

శుక్రవారం ఒక్కరోజే బ్రిటన్ 980 మంది మరణించారు వైరస్ కారణంగా. ఇక వైరస్ బారిన పడిన వారి సంఖ్య 73,758కి పెరిగింది.

ఇక ఇటలీ విషయానికి వస్తే శుక్రవారం రోజు మృతుల సంఖ్య 570 గా నమోదైంది. కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 18,849కి పెరిగింది. ఇక్కడ కఠినమైన ఆంక్షలు అమలవుతున్నా ఏప్రిల్ 14 నుంచి కొంత సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

స్పెయిన్‌లో నిన్న ఒక్కరోజే 605 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడి మ‌ృతుల సంఖ్య 15,483కు చేరుకుంది. ఇక కొత్తగా వైరస్ పాజిటివ్ కేసులు 4,567 మందిని గుర్తించారు.

కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినప్పటికి నిరంతర పర్యవేక్షణ కొనసాగాలని అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story