ఆ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్..

ఆ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్..

కరోనా వైరస్ పుణ్యమాని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కొత్త వీసా నిబంధనలు ప్రవేశపెట్టారు. COVID-19 సమయంలో తమ పౌరులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బందులకు గురిచేశారని కొన్ని దేశాల పౌరులకు వీసా నిరాకరణకు పూనుకున్నారు. ఇందుకు సంబంధించి ట్రంప్ మెమోరాండం కూడా జారీ చేశారు, ఇది వెంటనే అమలులోకి వస్తుంది, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతోంది. వీసా నిబంధనల మార్పులకు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ, విదేశాంగ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story