రాములో రాములా.. కరోనా హైరానా

రాములో రాములా.. కరోనా హైరానా

కరోనా వైరస్.. మనిషిపై ఎంత ప్రభావాన్ని చూపిస్తోంది.. కంటికి కనిపించట్లేదు కానీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వార్తలు రాస్తూ కొందరు.. చదువుతూ కొందరుంటే.. మరి కొంత మంది కలం చేతబట్టి కథలు, కవితలు అల్లేస్తున్నారు. పాటల్లో పదనిసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన అలవైకుంఠ పురం చిత్రంలోని పాటలను తీసుకుని అలవోకగా మార్చేసి కరోనా పాటగా ట్యూన్ కట్టేశారు ఇక్కుర్తి సదాశివరావు గారు. బంటూ గానికి ట్వంటీటూ.. బస్తిలో మస్తు కటౌటు పాటను.. చైనాలో పుట్టింది మెల్లగ అంతా పాకింది అంటూనే రాములో రాములా పాటను కరోనా.. హైరానా ప్రాణం పోతుందిరో అని తనలో ఉన్న కవి హృదయాన్ని బయటకు తీసుకువచ్చారు. కరోనా వైరస్‌పై కత్తి ఎలాగూ దూయలేము.. కనీసం కలానికైనా పనిచెబుదాం అని వైరస్ మన జీవితాల్ని ఎలా చిధ్రం చేస్తుందో వివరించారు.

carona-pata

Tags

Read MoreRead Less
Next Story