సౌదీ మాల్‌లో తెలంగాణ వ్యక్తి చేసిన పని.. అతడిపై హత్యా నేరం యోచన

సౌదీ మాల్‌లో తెలంగాణ వ్యక్తి చేసిన పని.. అతడిపై హత్యా నేరం యోచన

కరోనా వైరస్ తో తుమ్మినా, దగ్గినా అతని వైపు అనుమానపు చూపులు సర్వసాధారణం అయ్యాయి ఇప్పుడు. ఆ తుమ్ములే తెలంగాణకు చెందిన వ్యక్తిని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా అతనిపై హత్యాయత్నం కేసు నమోదయ్యే అవకాశానికి దారితీశాయి. తెలంగాణలోని జనగామకు చెందిన ఓ వ్యక్తి సౌదీలో ఉంటున్నాడు. ఇటీవలే స్వదేశానికి వచ్చి మళ్లీ సౌదీ వెళ్లాడు. అయితే.. అతను షాపింగ్ చేసేందుకు ఈ నెల మొదటి వారంలో ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. పదే పదే తుమ్ముటం, దగ్గుతూ మాల్ సిబ్బంది కంట పడ్డాడు. ఇదంతా అక్కడి అరబ్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి గమనించింది. కరోనా వైరస్ పై అప్పటికే అవగాహన చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన ఆ అమ్మాయి జనగామ వ్యక్తి తుమ్ముతున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూపర్ మార్కెట్ కు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలటంతో అతనితో పాటు క్యాంపులో ఉంటున్న 47 మందిని నిర్బంధంలోకి(క్వారంటైన్) తరలించారు. వారందరికీ వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా.. 44 మందికి నెగిటివ్ వచ్చింది. అయితే.. మిగతా ముగ్గురి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ముగ్గురిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి మిగిలిన 44 మందిని డిశ్చార్జ్ చేశారు. అయితే.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నావైరస్ సోకినట్లు తెలిసి ఆ విషయాన్ని దాచిపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే సౌదీ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనగామ వ్యక్తిపై హత్య కేసు నమోదు చేయాలని సౌదీ ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, తెలంగాణ వ్యక్తి వెళ్లిన సూపర్ మార్కెట్‌ని శానిటైజ్ (క్రిమిసంహారక మందు చల్లటం) చేశారు. ఇదే కాకుండా అతడు తాకిన ర్యాక్ లోని దాదాపు 35 లక్షల విలువైన సరుకులను కూడా ధ్వంసం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story