Top

కరోనా ఎఫెక్ట్.. 65 మంది ఖైదీల విడుదల

కరోనా ఎఫెక్ట్.. 65 మంది ఖైదీల విడుదల
X

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని వివిధ జైళ్ల నుంచి 65 మంది ఖైదీలను రిలీజ్ చేశారు.ఈ మేరకు జైళ్లశాఖ డీజీ జమ్ముకశ్మీర్‌ హైకోర్టుకు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, అండర్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా విడుదల చేయడానికి మార్చి 30న సర్కార్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు ఏప్రిల్‌ 7 నాటికి ప్రజా భద్రత చట్టం కింద అరెస్టయిన 22 మందిని, 32 మంది అండర్‌ ట్రయల్స్‌ను విడుదల చేశారు. అలాగే సీఆర్‌పీసీ 107, 109, 151 సెక్షన్స కింద అరెస్టయిన తొమ్మిది మందిని కూడా విడుదల చేశామని జైళ్లశాఖ డీజీ తెలిపారు. ఇక మరో 19 మంది పెరోల్‌పై విడుదలయ్యారిని వెల్లడించారు.

Next Story

RELATED STORIES